స్టార్ హీరో సినిమాకి మినిస్టర్ రివ్యూ

35
- Advertisement -

లియో సినిమాలో విజ‌య్ యాక్టింగ్‌ లో ఇర‌గ‌ దీశాడ‌ని త‌మిళ‌నాడు మినిస్ట‌ర్‌, హీరో ఉద‌య‌నిధి స్టాలిన్ అన్నారు. ఈ సినిమాపై స్టాలిన్ చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. మంగళవారం వేసిన స్పెష‌ల్ ప్రివ్యూస్ లో స్టాలిన్ ఈ సినిమాను వీక్షించారు. లోకేష్ క‌న‌గరాజ్ ఫిల్మ్ మేకింగ్ అద్భుత‌మ‌ని, ఆయన సినిమాటిక్ యూనివర్స్ కు ప్ర‌తి ఒక్క‌రూ ఫిదా అవుతార‌ని అన్నారు. ఇక ‘లియో’ రిలీజ్ డేట్ విష‌యంపై కూడా క్లారిటీ వచ్చింది. ఆఖ‌రి నిమిషంలో ఈ సినిమా తెలుగు వెర్ష‌న్ రిలీజ్‌పై కోర్టు స్టే విధించిన సంగ‌తి తెలిసిందే.

తెలుగులో ఇప్ప‌టికే లియో టైటిల్ రిజిస్ట‌ర్ కావ‌డంతో కోర్టు స్టే విధించింద‌ని, ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకున్నామ‌ని, లియో సినిమా ముందు అనుకున్న‌ట్లుగా అక్టోబ‌ర్ 19న రిలీజ్ అవుతుంద‌ని నిర్మాత నాగ‌వంశీ తెలిపాడు. విజయ్ హీరోగా లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ లియో సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వస్తాయని మేకర్స్ ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ ఓపెనింగ్స్ వస్తే.. అది హీరో విజయ్ కే మంచిది. రాకపోతే విజయ్ కే బ్యాడ్ నేమ్. కారణం.. ఈ సినిమా కోసం విజయ్ తన సినీ కెరీర్ లోనే భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నాడు.

Also Read:కాంగ్రెస్‌లో తగ్గని కన్ఫ్యూజన్ గోల?

ఎలాగూ ఈ మూవీకి ఇప్పటికే గ్లోబల్ లెవల్ లో ఎంతో హైప్ క్రియేటైంది. అయితే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ కోసం విజయ్ కూడా భారీగా రెమ్యునరేషన్ అందుకోవడంతో బడ్జెట్ చాలా ఎక్కువ అయ్యింది. ఇంతకీ, విజయ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా ?, విజయ్ ఏకంగా రూ.80 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకున్నట్లు సమాచారం. అందుకే, ఈ సినిమాకి విజయ్ కి కూడా చాలా కీలకంగా మారింది.

Also Read:CM KCR:కే‌సి‌ఆర్ తో ఢీ కొట్టి నిలిచేరా?

- Advertisement -