వావ్.. విజయ్ సరికొత్త రికార్డు

24
- Advertisement -

దళపతి విజయ్ ‘లియో’ సినిమాతో గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. అడ్వాన్స్‌ బుకింగ్స్‌లోనే అత్యధిక వసూళ్లు చేసిన ఈ చిత్రం మొదటిరోజు మంచి బిజినెస్‌ చేసింది. సినీ విశ్లేషకుల లెక్కల ప్రకారం తొలిరోజు రూ.140 కోట్లకు పైగా రాబట్టింది. దీంతో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన కోలీవుడ్‌ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు రెండో రోజు కూడా ఈ సినిమాకి రూ.60 కోట్లకు పైగా వచ్చాయని టాక్ నడుస్తోంది. నిజంగా రెండో రోజు కూడా ఆ రేంజ్ కలెక్షన్స్ వస్తే.. విజయ్ సినీ కెరీర్ లోనే ఈ సినిమా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టే సినిమాగా నిలిచే అవకాశం ఉంది.

మరోపక్క ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ దక్కించుకోగా ఈ విషయాన్ని ‘లియో‘ టైటిల్ కార్డులలో వెల్లడించారు. ఇక, ఈ సినిమా అక్టోబర్ 19న థియేటర్లలో రిలీజ్ అవ్వగా నవంబర్ 3వ వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని అంచనా. ప్రస్తుతం థియేటర్స్ లో భారీ హిట్ అందుకున్న ఈ సినిమా, మరి ఓటీటీలో ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక హీరో విజయ్ తమిళ నాట ఏ నాటికైనా సీఎం అయిపోవాలని కలలు కంటున్నాడు. అందుకే, తమిళనాడు ప్రభుత్వం విజయ్ లియో సినిమా పై బాగా నెగిటివిటి ప్రచారం చేస్తోంది.

ఇప్పటీకే, ‘లియో’ మూవీ ఆడియో లాంచ్ జరక్కుండా అడ్డుకున్నారంటూ సీఎం స్టాలిన్ ప్రభుత్వంపై విజయ్ ఫాన్స్ సీరియస్ గా ఉన్నారు. అటు స్టాలిన్ ప్రభుత్వ అనుచరులు కూడా సోషల్ మీడియా వేదికగా విజయ్ లియో సినిమా ప్లాప్ కావాలని కోరుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా టాక్ కాస్త తేడా పడేసరికి #LeoDisaster హాష్ టాగ్ ట్రెండ్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు. నిజానికి లియో ఫస్ట్ హాఫ్ పర్వాలేదు, సెకండ్ హాఫ్ మరీ నీరసంగా ఉంది. దాంతో లియో చూడలేకపోయామంటూ యాంటీ ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు. కానీ, కలెక్షన్స్ మాత్రం ఈ సినిమాకి భారీగా వస్తున్నాయి.

Also Read:జిట్టా ఉంటే ఫైళ్ల శేఖర్ రెడ్డి ఉండకపోయేవాడు:కేటీఆర్

- Advertisement -