CM KCR:కే‌సి‌ఆర్ తో ఢీ కొట్టి నిలిచేరా?

24
- Advertisement -

ఏనుగు ఎంత బలమైనదో అడవిలోని అన్ని జంతువులకు బాగా తెలుసు. కానీ నక్క మాత్రం అతి తెలివి ప్రదర్శించి ఎందుకు కంటే తానే కె బలం ఎక్కువ అని, ఏనుగుతో పోటీకి దిగితే తానే గెలుస్తానని కలలు కంటూ ఉంటుంది. కానీ ఏనుగు బలంలో నక్క బలం ఒక్క శాతం కూడా ఉండదు. తీర పోటీలో నిలిచి ఏనుగు కాలు మోపగనే నక్క తోక ముడిచి పరారవుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలకు ఈ కథ సరిగ్గా సరిపోతుంది. ఏనుగు లాంటి కే‌సి‌ఆర్ తో పోటీలో నిలిచి గెలుస్తామని ప్రబల్భాలు పలుకుతూ పగటి కలలు కంటున్నారు కొందరు నేతలు. అధినేత కే‌సి‌ఆర్ ఈసారి రెండు చోట్ల పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. గద్వేల్ మరియు కామారెడ్డి నుంచి ఆయన బరిలోకి దిగనున్నారు. .

అయితే అధినేత కే‌సి‌ఆర్ ను ఎదుర్కొనేందుకు కామారెడ్డి నియోజిక వర్గంలో కాంగ్రెస్ నుంచి షబ్బీర్ అలీ, అలాగే గజ్వేల్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి ఈటల రాజేందర్ తెగ ఆరాటపడుతున్నారు. ఏనుగు లాంటి కే‌సి‌ఆర్ ను ఎదుర్కోవడం అంతా తేలికైన విషయం కాదని తెలిసికూడా బరిలో నిలిచేందుకు సిద్దమౌతున్నారు. అయితే కామారెడ్డి నియోజకవర్గంలో తన ఓటమిని ముందే పసిగట్టిన షబ్బీర్ అలీ కే‌సి‌ఆర్ తో పోటీలో నిలవలేనని సీటు మార్చాలని అధిష్టానం ముందు మొర పెట్టుకుంటున్నారట.

Also Read:BJP:అభ్యర్థులు కావాలండోయ్ !

ఎందుకంటే కే‌సి‌ఆర్ తో పోటీలో నిలిస్తే కనీసం తన వర్గం ఓట్లు కూడా రావనే భయం షబ్బీర్ అలీ లో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే కామారెడ్డి నుంచి తప్పుకోవాలని ఆయన చూస్తున్నాడట. ఇక బీజేపీ నుంచి ఈటల రాజేందర్ మాత్రం ఎలాగైనా పోటీలో నిలవాలని తెగ ఆరాటపడుతున్నారు. దీంతో ఈటెల వైఖరి అన్నీ తెలిసి సింహం బోనులోకి వెళ్ళినట్లుగా ఉందని రాజకీయవాదులు అభిప్రాయ పడుతున్నారు. అధినేత కే‌సి‌ఆర్ తో పోటీ అంటే ప్రత్యర్థిలు ఓటమిని ముందే ఒప్పుకోవడమే. మరి కే‌సి‌ఆర్ తో డీ కొట్టి వీరు ఎంతవరకు నిలుస్తారో చూడాలి.

Also Read:Bigg Boss 7 Telugu:హద్దు దాటిన భోలే..బిగ్ బాస్ షాక్

- Advertisement -