ఇది భాషా పోరాటమే కాదు జాతి పోరాటం!

27
- Advertisement -

ఇది భాషా పోరాటమే కాదు జాతి పోరాటం కూడా అన్నారు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన ఉదయనిధి స్టాలిన్.. కేంద్ర ప్రభుత్వం త్రిభాషా విద్యావిధానం పేరుతో తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దుతోంది అని మండిపడ్డారు.

హిందీకి వ్యతిరేకంగా పోరాటం కేవలం భాషా పోరాటం మాత్రమే కాదు.. తమిళ సంస్కృతిని రక్షించడానికి కూడా ఒక జాతి పోరాటం. ఈ పోరాటం కొనసాగుతుంది అని స్టాలిన్‌ వ్యాఖ్యానించారు.

పెరియార్‌, గ్రాండ్‌మాస్టర్‌ అన్నా, ముత్తమిళర్‌ కలైంజర్‌, ఇప్పటి మన ముఖ్యమంత్రి స్టాలిన్‌తో సహా హిందీకి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు అని అన్నారు. 1986లో హిందీకి వ్యతిరేకంగా కరుణానిధి చేసిన ప్రసంగం ఇప్పటికీ సముచితంగానే ఉంటుందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. నీట్‌, ఎన్‌ఇపి, త్రిభాషా విధానాలకు సంబంధించి వాటి వెనుక ఉన్న వ్యూహాలను విద్యార్జులు అర్థం చేసుకోవాలని స్టాలిన్‌ కోరారు.

Also Read:బీఆర్ఎస్ సభ కోసం కూలీ పని!

- Advertisement -