ఉదయాన్నే నీళ్ళు తాగుతున్నారా.. ఇవి తెలుసుకోండి!

36
- Advertisement -

ప్రతిరోజూ ఉదయం నిద్ర లేవగానే చాలమందికి టి కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే మరికొందరికి ఉదయాన్నే నీరు తాగే అలవాటు ఉంటుంది. ప్రతిరోజూ ఉదయాన్నే నీళ్ళు తాగకపోతే వారికి ఏదో వెలితిగా ఉంటుంది. అయితే ఇలా ఉదయాన్నే పడగడుపున నీళ్ళు తాగడం వల్ల మనశరీరంలో ఏం జరుగుతుంది ? పడగడుపున నీళ్ళు తాగడం మంచిదేనా ? లేకపోతే ఏమైనా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయా ? ఇలాంటి ప్రశ్నలు చాలమందిలో ఉంటాయి. కొందరైతే ఉదయంపూట పడగడుపున నీళ్ళు తాగడం పలు రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందనే అపోహలో ఉంటారు. నిజానికి ఉదయం పూట పడగడుపున ఒక గ్లాసు నీరు త్రాగడం ఎంతో మేలని నిపుణులు చెబుతునారు. మరిముఖ్యంగా వేడి చేసిన నీరు గోరు వెచ్చగా ఉన్నప్పుడూ తాగితే అద్బుతమైన ప్రయోజనలు కలుగుతాయట.

Also Read: తేనెతో గుండెపోటు కు చెక్ !

మలబద్దకం వల్ల మలవిసర్జన సక్రమంగా జరగని వాళ్ళు ప్రతిరోజూ ఉదయాన్నే పడగడుపున ఒక గ్లాసు నీరు తాగితే మలవిసర్జన సాఫీగా జరిగి మలబద్దకం దూరమౌతుంది. అంతే కాకుండా శరీరంలోని అన్నీ అవయవాలకు రక్త ప్రసరణ సమృద్దిగా జరుగుతుంది. ఉదయం పూట నీరు తాగితే మూత్రపిండాలు కూడా శుభ్రపడతాయి. లివర్, మరియు జీర్ణాశయం లోని వ్యర్థాలను బయటకు పపించేందుకు తప్పనిసరిగా ఉదయం పూట ఒక గ్లాసు నీరు త్రాగలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా రాత్రి 5-7 గంటల పాటు నిద్ర పోవడం వల్ల శరీరం స్వల్ప డీహైడ్రేషన్ కు గురవుతుంది. అందువల్ల మైగ్రేన్, తలనొప్పి వంటి సమస్యలు వస్తుంటాయి.

Also Read: మిరియాలతో ఆ సమస్యలన్నీ దూరం !

అందువల్ల నిద్ర లేవగానే ఒక గ్లాసు నీరు తాగడం వల్ల శరీరం మళ్ళీ రిహైడ్రేట్ అయి యాక్టివ్ గా ఉండవచ్చు. నిద్ర లేవగానే నోటి దుర్వాసన సర్వసాధారణం. అందువల్ల నిద్ర లేవగానే ఒక గ్లాసు నీరు త్రాగడం వల్ల నోటి దుర్వాసన కూడా దూరం అవుతుంది. అన్నింటికి మించి ఉదయాన్నే నీరు తాగితే రోజంతా ఫుల్ యాక్టివ్ గా ఉండవచ్చు. అందుకే నిద్ర లేవగానే టీ, కాఫీ వంటివి తాగడం కన్నా ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తాగితే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే పడగడుపున నీరు ఎక్కువగా తాగితే దుష్ప్రభావాలు కూడా చూపే అవకాశం ఉంది. పడగడుపున నీళ్ళు ఎక్కువగా తాగితే కడుపులో తిప్పడం, వికారం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఉదయం పూట నీరు త్రాగే వాళ్ళు తగు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -