భారత ప్రయాణాలపై నిషేధం పొడగింపు

66
uae

భారత విమానాలపై నిషేధాన్ని పొడగిస్తున్నాయి పలు దేశాలు. ఇప్పటికే వివిధ దేశాలు జూన్ ఎండ్ వరకు భారత ప్రయాణాలపై ఆంక్షలు విధించగా తాజాగా యూఏఈ కూడా భార‌త్ నుంచి ప్ర‌యాణికుల విమానాల రాక‌పోక‌ల‌పై విధించిన నిషేధాన్ని యూఏఈ జూన్ 30 వ‌ర‌కు పొడిగించింది.

అయితే యూఏఈ పౌరులు, యూఏఈ గోల్డెన్ వీసా క‌లిగిన‌వారు, కొవిడ్ ప్రొటోకాల్‌ను పాటించే దౌత్య‌వేత్త‌ల ప్ర‌యాణానికి మిన‌హాయింపులు ఉంటాయ‌ని తెలిపింది. ఏప్రిల్ 25 నుండి యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (యూఏఈ) నిషేధం విధించగా తొలుత జూన్ 14 వ‌ర‌కు ఆ ఆంక్ష‌లు కొన‌సాగుతాయ‌ని ప్రకటించింది. అయితే ప్ర‌స్తుతం దానిని మ‌రో 16 రోజులు పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ది యూఏఈ.