మెట్రో రైలు కొత్త టైమింగ్స్‌ ఇవే..

78
hmr

రాష్ట్రంలో లాక్‌డౌన్‌కు మరో 10 రోజులు పొడిగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న సంగతి తెలిసిందే. సడలింపులు కాస్త పొడగించగా నేటి నుంచి ఉద‌యం 6 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట‌ల వ‌ర‌కు లాక్‌డౌన్ నుంచి వెసులుబాటు క‌ల్పించింది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. మొదటి రైలు టెర్మినల్ స్టేషన్ నుంచి ఉదయం 7:00 గంటలకు బయలుదేరనుంది. చివరి రైలు ఉదయం 11:45 వరకే ఉంటుందని ప్రకటించారు. ఈ రైలు మధ్యాహ్నం 12:45 గంటల కల్లా సంబంధిత చివరి టెర్మినేషన్ స్టేషన్‌కు చేరుకుంటుంది.