న్యూజిలాండ్ లో వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ లోయంగిండియా సత్తా చాటింది. ఇవాళ ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో.. నాలుగోసారి విశ్వవిజేతగా నిలిచింది . దీంతో గతంలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఇవాళ జరిగిన ఫైనల్లో 8 వికెట్లతో గెలిచి.. నాలుగోసారి విశ్వవిజేతగా నిలిచింది.
ఆసీస్ విధించిన 217 పరుగుల లక్ష్యాన్ని కేవలం 38.5 ఓవర్లలోనే చేజ్ చేసింది భారత్. టోర్నీ మొత్తం అజేయంగా నిలిచిన పృథ్వి షా సేన.. ఫైనల్లోనే అదే జోరు కొనసాగించి, తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది.
బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్.. ఇలా అన్ని రంగాల్లో రాణించి మూడుసార్లు విశ్వ విజేత అయిన ఆస్ట్రేలియాను ఓ పసికూనగా మార్చేసింది. ఓపెనర్ మన్‌జోత్ కల్రా (101 నాటౌట్) సెంచరీతో చెలరేగాడు.
టోర్నీ తొలి మ్యాచ్‌లోనే ఇదే ఆస్ట్రేలియాపై వంద పరుగులతో గెలిచిన టీమిండియా.. ఫైనల్లోనూ ఆసీస్‌ను మట్టి కరిపించింది. టోర్నీలో ఆసీస్‌తో మొదలుపెట్టి పపువా న్యూ గినియా, జింబాబ్వే, బంగ్లాదేశ్, పాకిస్థాన్.. మళ్లీ ఆస్ట్రేలియాపై గెలిచి నాలుగోసారి వరల్డ్‌కప్ ఎగరేసుకుపోయింది. రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌లో రాటుదేలిన పృథ్వి షా సేన.. నిజమైన చాంపియన్ టీమ్‌లాగే ఆడి విజయం సాధించింది.