తెలంగాణ వెదర్ రిపోర్ట్…మరో రెండు రోజులు వర్షాలు

182
Rains in Telangana

ఉత్తర బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న అల్పపీడనం ఈరోజు(ఆగస్టు 25 వ తేదీన) ఉదయం అదే ప్రాంతములో తీవ్ర అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధముగా 7.6 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ నైఋతి దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది.

ఉత్తర-దక్షిణ ద్రోణి రాయలసీమ నుండి దక్షిణ తమిళనాడు వరకు 0.9 km ఎత్తు వరకు కొనసాగుతోంది.అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు కొన్ని చోట్ల, రేపు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.పు ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది.