హైదరాబాద్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు…

200
srinivas

రాష్ట్రంలో కరోనా అదుపులో ఉంది….హైదరాబాద్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్.రాష్ట్రంలో మరణాలు ఒక శాతానికి తక్కువగా ౦.7 శాతం మాత్రమే నని….ప్రతి రోజు 40 వేల పరీక్షలు చేస్తున్నాం అని తెలిపారు.

గత 24 గంటల్లో 53 వేల పరీక్షలు చేశాం….మొత్తం పరీక్షల్లో, 50 శాతం పరీక్షలు ఆగస్టు నెలలోనే జరిగాయని తెలిపారు.ప్రతి పది లక్షల మందికి 27502 పరీక్షలు చేస్తున్నాం
….హైదరాబాద్ లోని ప్రయివేట్ ఆస్పత్రుల్లో పక్క రాష్ట్రాల రోగులు కూడా ఉన్నారని తెలిపారు.

వరుస వర్షాల వల్ల సీజనల్ రోగాలు కూడా పెరిగాయి..సీజనల్ డీసీజ్ లకు వుండే లక్షణాలు కోవిడ్ కు కూడా ఉంటాయి..సీజనల్ డీసీజ్ లను నిర్లక్ష్యం చేయొద్దు.. టెస్టులు చేయించుకోవాన్నారు శ్రీనివాస్.వైద్య సిబ్బంది కరోనాపై అలుపెరగని యుద్ధం చేస్తోంది…2 వేలకు మందికి పైగా వైద్య సిబ్బంది కరోనా భారిన పడ్డారని తెలిపారు.

హైదరాబాద్ లోనే కాకుండా, జిల్లాల్లో సైతం కరోనా ట్రీట్మెంట్ అందిస్తున్నాం అని తెలిపారు డిఎంఈ రమేష్ రెడ్డి.రిమోట్ ఏరియాల్లో కూడా కరోనా ట్రీట్మెంట్ అందుతుంది..యాంటీ వైరల్ డ్రగ్స్ ను అన్ని ఆస్పత్రులకు సప్లై చేస్తున్నాం..కరోనా , కాకుండా ఇతర రోగాల విషయంలో కూడా చికిత్స అందించాల్సిన అవసరం ఉందన్నారు.