ఉత్తర కోస్తా ఒరిస్సా మరియు దానిని ఆనుకుని ఉన్న గాంగేటిక్ పశ్చిమబెంగాల్ ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధముగా 7.6 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్ళే కొద్దీ నైఋతి దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది. రాగల 24 గంటలలో ఇది మరింత బలపడే అవకాశం ఉంది.
తూర్పు-పశ్చిమ shear zone Lat.18.0 deg.N వెంబడి పెనిన్సులర్ భారతదేశం మీదుగా 5.8 km నుండి 7.6 km ఎత్తు మధ్య ఏర్పడింది.ఈరోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.
ఈరోజు, రేపు ఆదిలాబాద్, నిర్మల్, కోమురంభీం –ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్-పట్టణ, వరంగల్- గ్రామీణ, మెహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ మరియు సూర్యాపేట జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది మరియు ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.