రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు..

230
rains telangana
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వెదర్ రిపోర్టును తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ. నైరుతి మధ్య ప్రదేశ్ ప్రాంతములో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధముగా 3.6 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతం ప్రాంతాలలో సుమారుగా ఆగస్టు 9 వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.ఈరోజు అక్కడక్కడ ఉరుములు మరియు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది.ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.

రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు మరియు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది.

- Advertisement -