గ్రీన్ ఛాలెంజ్‌ మొక్కలునాటిన ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి

44
vittal

ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాల బ్రహ్మాండంగా ముందుకు కొనసాగుతుంది. ప్రముఖులు తమకు ఛాలెంజ్ రావడమే ఆలస్యం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటడం జరుగుతుంది. ముఖ్యంగా రాజ్య సభ సభ్యులు సంతోష్ గారు పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటాలని పిలుపు నిచ్చిన ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వస్తుంది. ప్రముఖులు తన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన పిలుపునందుకుని రాజకీయ నాయకులు, సినీ తారలు, క్రీడాకారులు, అందరూ పుట్టిన రోజు నాడు మొక్కలు నాటి ఈ విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు.

తాజాగా ఎంపీ సంతోష్ కుమార్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా ముధోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విట్టల్ రెడ్డి మొక్కలు నాటారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించి ముందుకు తీసుకుపోతున్న రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు .

“నా జన్మదినం సందర్భంగా గౌరవనీయులు ఎంపీ శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకంక్షాలు తెలియజేసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం లో భాగంగా మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేసారు, ఎంపీ శ్రీ సంతోష్ కుమార్ గారి విజ్ఞప్తి మేరకు, సూచనల మేరకు ఈ రోజు నా పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటడం జరిగినది, చాలా సంతోషంగా ఉందన్నారు.

కార్యకర్తలు అందరూ 200 మొక్కలు నాటారు. నియోజక వర్గం లో ఇదివరకే లక్షలాదిగా మొక్కలు నాటడం జరిగినది, మరియు వచ్చే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున మొక్కలు నాటే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మా నియోజకవర్గం లో అత్యధిక సంఖ్యలో చేపడుతాం” అని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు.