Monday, December 23, 2024
Home గాసిప్స్ ‘కళ్యాణ్ రామ్’  సరసన  ఆ ఇద్దరు 

‘కళ్యాణ్ రామ్’  సరసన  ఆ ఇద్దరు 

12
- Advertisement -
హీరో ‘కళ్యాణ్ రామ్’ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిర్మాత ‘దిల్ రాజు’ నిర్మించే ఈ సినిమాకు ‘సామజవరగమన’  దర్శకుడు రామ్ అబ్బరాజు పని చేస్తారు. ఈ మేరకు కథ ఓకె అయింది. ఈ సినిమా కోసం ఇద్దరు హీరోయిన్లను తీసుకుంటున్నారు. హాట్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఓ హీరోయిన్. అలాగే,  ఈగల్ సినిమాలో నటించిన  ‘కావ్య థాపర్’  మరో హీరోయిన్. ఈగల్ సినిమాలో ‘కావ్య థాపర్’ను చాలా బాగా చూపించారు. అందుకే, ఆ మధ్యే కావ్య థాపర్ తో  దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేసే అగ్రిమెంట్ కుదిరింది.
 

‘కళ్యాణ్ రామ్’ ప్రస్తుతం ఓ సినిమాను పీపుల్స్ మీడియా సంస్థలో చేస్తున్నారు. అది దాదాపు పూర్తి కావచ్చింది. దాని తర్వాత ఎన్టీఆర్ ఆర్ట్స్  సినిమా ప్రారంభమవుతుంది. పూర్తిగా యూత్ పుల్ రోమ్ కామ్ జానర్ లో ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేసారు. ఆ తర్వాత దిల్ రాజు – కళ్యాణ్ రామ్ కలయికలో మొదలు కాబోయే సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాలో సరికొత్త కళ్యాణ్ రామ్ ను చూపించబోతున్నారు. కళ్యాణ్ రామ్ లుక్ కూడా చాలా వైవిధ్యంగా ఉంటుందని టాక్. కొత్త కథలు అంటే ఇష్టపడే కళ్యాణ్ రామ్ కి  ఇది సరికొత్త కథ అవుతుందట.    
 
 
నిజానికి, గతంలో ‘దిల్ రాజు – కళ్యాణ్ రామ్’ కాంబినేషన్ లో ఓ సినిమా రావాల్సింది. కానీ, అప్పుడు కుదరలేదు. ఫైనల్ గా ఇప్పుడు సెట్ అయ్యింది. ఐతే, ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన నిధి అగర్వాల్ ను ఫైనల్ చేయడమే ఇప్పుడు కొంతమందికి నచ్చడం లేదు. నిధి అగర్వల్ కి ప్లాప్ హీరోయిన్ అని సాలిడ్ నేమ్ ఉంది. ఏది ఏమైనా నిధి అగర్వాల్ కి మాత్రం  ఒక సినిమా తర్వాత మరో సినిమా వస్తూ,  కెరీర్ ముందుకు సాగుతూనే వుంది. మరి కళ్యాణ్ రామ్ సినిమాతో అయినా,  ఆమె ప్రూవ్ చేసుకుంటుందా ? చూడాలి.
- Advertisement -