అసలు హీరోయిన్ అంటూ లేదట

298
- Advertisement -

ఇటీవలే యంగ్ టైగర్ ఎన్టీఆర్-బాబీల సినిమా ప్రారంభమైంది. 15నుంచి తారక్ కూడా షూటింగ్‌లో జాయిన్ అవుతాడని చెబుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రాశీ ఖన్నాను ఎంపిక చేశారు. రెండో హీరోయిన్‌గా నివేదా థామస్ అని చెబుతున్నా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇక, మూడో హీరోయిన్…! ఆ ఊసే లేదు అసలు. ఇద్దరు హీరోయిన్ల గురించి పక్కనపెడితే.. ఇప్పుడు మూడో హీరోయిన్‌పై వస్తున్న వార్తలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

Two Heroines confirmed for NTR's

మరి, మూడో ఎన్టీఆర్‌కు హీరోయిన్‌గా నటిస్తున్నదెవరు? ఈ ప్రశ్నకు సమాధానం.. అసలు హీరోయిన్ అంటూ లేదట. ఓ స్టార్ హీరోయిన్‌తో కేవలం గెస్ట్ రోల్ చేయించే యోచనలో ఉన్నారట. మూడు విభిన్న పాత్రల్లో ఎన్టీఆర్‌ను ప్రెజెంట్ చేయబోతున్న బాబీ.. ఇద్దరు ఎన్టీఆర్‌లకు హీరోయిన్లను పెట్టినా మూడో పాత్రకు హీరోయిన్ అవసరం లేదని భావిస్తున్నాడట. అందుకే మూడో హీరోయిన్ అనే ప్రసక్తే లేదు కానీ.. గెస్ట్ రోల్ మాత్రం ఉంటుందని చెబుతున్నాడు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఎన్టీఆర్ మూడో పాత్ర కొద్ది సేపు మాత్రమే ఉంటుందట. ఆ పాత్ర నిడివి ఎంతసేపు అనేది తెలియకపోయినా.. పూర్తిగా మాత్రం ఉండదని ఫిల్మ్‌నగర్ వర్గాలు అంటున్నాయి.

- Advertisement -