ఇది హెల్ప్ అవదు అంటున్న జక్కన్న..

230
Baahubali 2 new poster
- Advertisement -

‘బాహుబలి ది కన్‌క్లూజన్’ ట్రైలర్‌ను ఈ నెల 16 విడుదల చేయనున్నారు. ‘బాహుబలి ది బిగినింగ్’ ట్రైలర్‌ను ఏ విధంగా అయితే రిలీజ్ చేశారో అదే విధంగా ‘బాహుబలి ది కన్‌క్లూజన్’ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేయాలని చిత్రం బృందం నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లలో మార్నింగ్ షో మొదలుకావడానికి ముందు ట్రైలర్‌ను ప్రదర్శించబోతున్నారు. అనంతరం అదే రోజు సాయంత్రం ట్రైలర్‌ను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ‘బాహుబలి ది బిగినింగ్’ ట్రైలర్‌ మొదట బిగ్ స్క్రీన్‌పై రిలీజ్ అయ్యి, ఆ తర్వాత య్యూటూబ్‌లో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే.

 Baahubali 2 new poster

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గంట క్రితం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. తాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి ది కన్‌క్లూజన్’ ట్రైలర్ విడుదల సమయాన్ని అధికారికంగా ప్రకటించిన కొద్దిసేపటికే రాజమౌళి ఓ ఫొటోను షేర్ చేశారు. అమరేంద్ర బాహుబలి చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు కట్టప్ప ఎత్తుకుని మురిసిపోతున్న ఫొటోతో పాటు బాహుబలిని కట్టప్ప చంపుతున్న ఫొటోను కలిపి డిజైన్ చేసిన ఫొటోను పోస్ట్ చేసి, ‘ఈ పిల్లాడిని ఎవరైతే ఎత్తుకున్నారో అతడే చంపేశాడు’ అని రాజమౌళి పేర్కొన్నాడు.

ఈ ఫొటోను తమ డిజైనర్ జగన్ డిజైన్ చేశారని, ఈ ఐడియా అతడే ఇచ్చాడని రాజమౌళి తెలిపారు. ‘‘ఇది హెల్ప్ అవదు. కానీ అనుకోకుండా పోస్ట్ చేశా’’ అని రాజమౌళి తన ఖాతాలో రాసుకొచ్చారు.

- Advertisement -