దేశ ప్రతిష్టకు భంగం కలిగితే చర్యలు తప్పవు

170
bangladesh
- Advertisement -

ఒలంపిక్‌, ఆసియా వివిధ రకాల టోర్నీలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఇదే కోవలోకి వస్తుంది కామన్‌వెల్త్‌ గేమ్స్‌. అసలు ఏంటి కామన్‌ వెల్త్‌ గేమ్స్‌ బ్రిటీష్‌ వలస రాజ్యపాలన నుండి స్వాతంత్య్రం పొందిన దేశాలను కామన్‌ వెల్త్‌ దేశాలుంటారు. ఇటివలే కామన్‌ వెల్త్‌ గేమ్స్‌ ముగిశాయి. అయితే దీంట్లో వింత ఏముంది అనుకుంటున్నారు కదూ. బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు టెబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణులు డుమ్మా కోట్టడం… ఈవెంట్‌కు వెళ్లిన టీటీ ప్లేయర్‌లు మ్యాచ్‌కు ముందు బందువుల ఇంటికి వెళ్లి రావడం ఇప్పుడు చర్చానీయంశమైంది. దీంతో ఆ దేశ క్రీడల సమాఖ్య నిషేఢం విధించింది.

సోనమ్‌ సుల్తానా సోమా, సాదియా అక్తర్‌ మౌ అనే ఇద్దరు బంగ్లాదేశ్‌ టీటీ ప్లేయర్లు… బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన కామన్‌ వెల్త్‌ గేమ్స్‌ 2022లో ఆగస్టు 5న షెడ్యూలైన మహిళల మ్యాచ్‌ల్లో పాల్గొనాల్సి ఉంది. ఈ జోడీ క్యాంప్‌ నుంచి ఎవరికి చెప్పకుండా, ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మ్యాచ్‌ సమయానికి కనిపించకుండా పోయారు. దీంతో ప్రత్యర్థులకు బై లభించింది. అలస్యంగా వెలుగులోకి రావడంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బంగ్లాదేశ్‌ క్రీడల సమాఖ్య…దేశ ప్రతిష్టకు భంగం కలిగించారన్న కారణంగా ఇద్దరు మహిళా టీటీ ప్లేయర్లపై రెండేళ్ల నిషేధం విధించింది. విచారణలో ఇద్దరు వారి బందువుల ఇళ్లకు వెళ్లి వచ్చారని తెలిపారు. దీంతో అగ్రహించిన బంగ్లాదేశ్‌ క్రీడల సమాఖ్య ఇద్దరిపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిషేధం అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు డొమెస్టిక్‌ సర్క్యూట్‌కు కూడా వర్తిస్తుందని బంగ్లాదేశ్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌ ప్రకటించింది.

 

 

- Advertisement -