కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు అంశంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న రాజ్యసభలో మాట్లాడారు. మోడీ నిర్ణయాన్ని ‘వ్యవస్థీకృత దోపిడీ, చట్టబద్ధంగా కొల్లగొట్టడం’గా ఆయన అభివర్ణించారు. ప్రధాని మోడీ సభకు హాజరవటంతో.. ప్రశ్నోత్తరాలను ఎత్తేసి నోట్లరద్దుపై చర్చకు అధికార, విపక్షాలు అంగీకరించాయి. దీంతో 12 నుంచి ఒంటిగంట మధ్య ప్రశ్నోత్తరాల్లో మన్మోహన్ ప్రసంగించారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారంటూ తన మనోగతాన్ని వెలిబుచ్చారు మన్మోహన్. దీనిపై నెటిజన్లు కొందరు కామెంట్లు చేస్తే, మరికొందరు ఆయన మాట్లాడిన దానికి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్ని చర్చలు జరిగినా పెద్దగా స్పందించకుండా.. మాట్లాడకుండా ఉన్న మన్మోహన్ ఒకేసారి సుదీర్ఘ ప్రసంగం చేయడంపై నెటిజన్లు సరదాగా స్పందించారు.
‘ఓ మై గాడ్.. మన్మోహన్ సింగ్ రాజ్యసభలో మాట్లాడమే కాదు… సామాన్యుని కష్టాల గురించి వివరిస్తున్నారు. ‘మోడీకి ఇది పెద్ద అచీవ్‌మెంట్’…
‘మేడం చెప్పిన ఈ మాటలను నేను రిపీట్ చేస్తున్నాను. ఐయామ్ సో సారీ’
‘బ్రేకింగ్ న్యూస్.. మన్మోహన్‌సింగ్ తన గొంతును కనుగొన్నారు. ఇప్పుడు ఇక రాహుల్ బుర్ర ఎక్కడుందో కాంగ్రెస్ నేతలు కనుగొనాలి’ అంటూ పలువురు వ్యంగ్యంగా ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేశారు.
‘మన్మోహన్ సింగ్ స్పీచ్ అయిపోయింది, ఇక లే’ అని కేజ్రీవాల్ సిసోడియాను నిద్ర లేపుతున్న ఒక ఫోటోను ఈ సందర్భంగా కొందరు పోస్ట్ చేశారు.
మన్మోహన్ సింగ్ రాజ్యసభలో మాట్లాడడం మొదలుపెట్టగానే మరొకరు ట్విట్టర్లో ఓ కామెడి వీడియో పెట్టారు..
https://twitter.com/SmokingSkills_/status/801683262888296452