తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండవ విడత గొర్రెల పంపిణీ పథకంను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు సూచనలు జారీ చేశారు సీఎస్ శాంతి కుమారి. ఈ మేరకు తగు కార్యచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. రెండవ విడత గొర్రెల పంపిణీ పథకంకు గొర్రెల యూనిట్ల సేకరణ, రవాణా, లబ్ధిదారుల నుండి డిపాజిట్ల సేకరణ, తదితర కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అన్నారు. బీఆర్కే భవన్‌లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ… రాష్ట్రంలో రెండవ విడతలో 3.38 లక్షల మందికి గొర్రెలను పంపిణి చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళికలను సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. కలెక్టర్ల నాయకత్వంలోనే ఈ గొర్రెల పంపిణి కార్యక్రమం నిర్వహించాలని స్పష్టం చేశారు. అత్యధిక లబ్దిదారులున్న 12 జిల్లాల కలెక్టర్లు ఈ పథకంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. రవాణా సంబంధిత టెండర్లను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా , పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, రోడ్లు , భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఎస్సీ అభివృద్ధి శాఖ కమీషనర్ యోగితా రాణా, మున్సిపల్ పరిపాలన శాఖ కమీషనర్ సత్యనారాయణ, పంచాయతీ రాజ్ కమీషనర్ హనుమంత రావు, TSIIC MD నర్సింహా రెడ్డి, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, తదితర అధికారులు ఈవీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. ఈ నెల 14వ తేదీన బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో చర్చించారు.
ఇవి కూడా చదవండి…