KCR:కే‌సీ‌ఆర్ తో మాములుగుండదు మరి !

60
- Advertisement -

దేశంలో అధికార బీజేపీ చేస్తున్న అక్రమాల గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. 2014లో అధికారం చేపట్టినది మొదలుకొని ఇప్పటివరకు బీజేపీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా తమకు ఎదురే ఉండకూడదనే నియంత ధోరణిలో మోడి సర్కార్ వ్యహరిస్తోంది. అందుకు మనం చాలానే ఉదాహరణలు చెప్పుకోవచ్చు. బీజేపీ నేతలు చేస్తున్న అక్రమాలను కప్పిపుచ్చుతూ కేవలం ప్రతిపక్ష నేతలను మాత్రమే టార్గెట్ చేయడం, ప్రశ్నించే మీడియా సంస్థలపై ఈడీ దాడులు నిర్వహించడం. ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూల్చి అక్రమంగా అధికారాన్ని చేజిక్కించుకోవడం, మత విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయ లబ్ది పొందడం.. ఇలా చెప్పుకుంటూ పోతే మోడి సర్కార్ దౌర్జన్యలకు సంబంధించి ఒక పెద్ద లీస్టే బయటకు తీయవచ్చు.

కాగా ఈ స్థాయిలో దౌర్జన్యలకు పాల్పడుతున్న మోడీ సర్కార్ ను ఎదుర్కోవడంలో దేశంలోని విపక్ష నేతలు వెనుకడుగు వేస్తున్నారు. కానీ తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ మాత్రం మోడీకి ఢీ కొట్టడంలో ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదనే సంకేతాలను గట్టిగానే ఇస్తున్నారు. తెలంగాణలో కూడా మహారాష్ట్ర మాదిరిగానే ఎమ్మెల్యేలకు ఎర వేసి కే‌సి‌ఆర్ ప్రభుత్వాన్ని కుల్చాలని చూసిన బీజేపీకి.. ఆధారాలతో సహ బయటపెట్టి కోలుకోలేని దెబ్బ తీశారు కే‌సి‌ఆర్. అలాగే ఈడీ దాడులతో కే‌సి‌ఆర్ ను ఇరకాటం,లో పెట్టాలని చూసినప్పటికి వాటిని కూడా అంతే స్థాయిలో తిప్పికొడుతున్నారు. ఇకా తాజాగా విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటం ఆడుతూ ప్రశ్న పాత్రలు లీక్ చేసి ఆ నేరాన్ని కే‌సి‌ఆర్ సర్కార్ పై నెట్టే ప్రయత్నం చేశారు కమలనాథులు..కానీ సి‌ఎం కే‌సి‌ఆర్ వారి కుతంత్రలను తిప్పికొడుతూ.. ప్రశ్నపత్రాల లీకేజ్ లో ప్రమేయం ఉన్న బీజేపీ చీఫ్ బండి సంజయ్ ని ఏకంగా జైలుకు పంపించారు. ఈ విధంగా కే‌సి‌ఆర్ ను ఇరకాటంలో పెట్టాలని చూసిన ప్రతిసారి బీజేపీనే బొక్కబోర్లా పడుతోంది. దాంతో ఇప్పటికైనా ఈ కుతంత్ర రాజకీయాలు మానుకోవాలని బీజేపీకి హితవు పలుకుతున్నారు రాజకీయ అతివాదులు.

ఇవి కూడా చదవండి…

Komatireddy: పార్టీ మార్పుపై క్లారిటీ

Kanti Velugu:గొప్ప కార్యక్రమం

BJP:బీజేపీ నీచ రాజకీయాలు మానదా ?

- Advertisement -