ప్రముఖ టీవీ యాంకర్ మృతి..

239
- Advertisement -

ప్రముఖ టీవీ యాంకర్, సినీ నటి మల్లిక అనారోగ్యంతో మృతి చెందారు. ఈ ఉదయం 10.30 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం పట్ల సినీ, టీవీ నటీనటులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఆమె అంత్యక్రియలు రేపు హైదరాబాద్ లో జరగనున్నాయి. తొలి తరం టీవీ యాంకర్ గా మల్లిక ప్రజాభిమానం చూరగొన్నారు.

TV anchor actress Mallika passes away

తెలుగు టీవీ పరిశ్రమలో టీవీ ప్రోగ్రాంలు మొదలైన సమయంలో యాంకర్ మల్లిక గురించి తెలియనివారంటూ ఎవరూ లేరు. ఆమె ప్రోగ్రాం లు వస్తున్నాయంటే చాలు టీవీలకు అతుక్కుపోయేవారు. ఆమె ఆ తర్వాత టీవీల్లోనూ సినిమాల్లోనూ కనిపించడం మానేసింది. అయితే ఇంతలోనే ఆమె చనిపోయిందన్న వార్త తెలుగు సినీ అభిమానుల హృదయాలను ద్రవింపజేస్తోంది.

ఆమె పంచదార చిలుక అనే సినిమాతో పాటు మరిన్ని సినిమాల్లో అలరించారు. మహేష్ బాబు హీరోగా తొలిచిత్రం రాజకుమారుడు లో కూడా ఈమె కనిపించింది. 1997-2004 మధ్యలో ఆమె యాంకరింగ్ కు అనేక అవార్డులు వచ్చాయి. విజయ్ సాయి అనే వ్యక్తిని ఈమె పెళ్ళి చేసుకున్నారు. ఆమె అసలు పేరు ఎం.అభినవ.. స్క్రీన్ నేమ్ గా మల్లిక అని పెట్టుకుంది. ఆమె మృతి గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -