మొక్కలు నాటిన టీవీ నటులు…

123
gic

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తలపెట్టిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా టి.వి., మూవీ నటులు స్వప్న, రమేష్ లు మొక్కలు నాటారు. జూబ్లీహిల్స్ లో పార్కు లో మొక్కలను నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.

టీవీ నటులైన చల్లా రమేష్, ప్రభావతి, మాధవి లకు. స్వప్న గ్రీన్ ఛాలెంజ్ చేయగా మధు, శిరీష, వందన, శశి లకు రమేష్ గ్రీన్ ఛాలెంజ్ చేశారు.ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కి వారు అభినందనలు తెలియజేశారు.