100 కోట్ల బడ్జెట్‌తో విజయ్‌ దేవరకొండ మూవీ!

134
vijay

ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఫైటర్‌. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్- చార్మితో పాటు కరణ్ జోహర్ నిర్మిస్తుండగా విజయ్ దేవరకొండ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా కరోనా కారణంగా కాస్త గ్యాప్ వచ్చింది.

ఈ సినిమా తర్వాత ఇంద్ర‌గంటి మోహ‌నకృష్ణ‌తో ఓ సినిమా చేయ‌నున్నాడ‌నే వార్త ఇండ‌స్ట్రీలో చక్క‌ర్లు కొడుతోంది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్న ఈ మూవీ దాదాపు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుందట.

ప్రస్తుతం ఈ వార్త టీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ విజయ్- ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబోలో భారీ బడ్జెట్‌తో మూవీ వస్తే ప్రేక్షకులకు ముఖ్యంగా ఫ్యాన్స్‌కు పండగే.