పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు: ప్రభాకర్

123
prabhakar gic

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు బుల్లితెర నటుడు ప్రభాకర్….గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మూడు మొక్కలు నాటనని బుల్లితెర నటుడు ప్రభాకర్ అన్నారు.

ఎక్కడున్నా సరే మొక్కలు నాటే విధంగా చూస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే పచ్చని చెట్లే ప్రగతికి మెట్ల అనే విధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు.

నటుడు హర్ష చాగంటి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ గచ్చిబౌలి లో మొక్కలు నాటిన ప్రభాకర్…అనంతరం మరో ముగ్గురు నటులు ( రాఘవ , సమీర్ , ప్రేమ్ ) లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసరాలని కోరారు..ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సాయిబాబా , ప్రభుత్వ ఉపాధ్యాయులు , వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.