దేశవ్యాప్తంగా నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల ఫలితం అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. హోరాహోరీగా సాగిన పోరులో టీఆర్ఎస్ అభ్యర్థి కవితపై బీజేపీ నేత ధర్మపురి అరవింద్ గెలుపొందారు. పసుపు బోర్డు కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా పెద్దసంఖ్యలో రైతులు నామినేషన్లు దాఖలు చేయడంతో స్థానికంగానే కాదు.. జాతీయ స్ధాయిలో ఇందూరు ఫలితంపై చర్చకు దారి తీసింది.
ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో బీజేపీ కీలకనేతలు రాజ్ నాథ్ సింగ్,రాంమాధవ్‌లు పసుపుబోర్డు ఏర్పాటుపై స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇక ఒక అడుగు ముందుకేసి బీజేపీ నేతలు రాంమాధవ్, ధర్మపురి అరవింద్ గెలిస్తే 5 రోజుల్లో పసుపు బోర్డు తీసుకువస్తామని రైతుల్లో ఆశలు రేకెత్తించారు. అంతేగాదు పసుపుబోర్డు సాధించలేకపోతే రాజీనామా చేస్తాననే బాండ్ పేపరే రాసిచ్చారు ధర్మపురి అరవింద్.
ఎన్నికల ఫలితాలు వచ్చి 5 రోజులు కాదు 50 రోజులు పూర్తైంది. ఇప్పటివరకు పసుపుబోర్డు ఉసే లేదు. కేంద్ర బడ్జెట్‌లో సైతం పసుపు బోర్డు ప్రస్తావన లేకపోవడంపై ఆయన ఒక్కమాట కూడా మాట్లాడలేదు. దీంతో పసుపు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. పసుపు రైతుల ప్రశ్నలను ఎదుర్కొలేక దాటవేత ధొరణిని అవలంభిస్తున్నారు ఎంపీ అరవింద్.
దీంతో పసుపు రైతులతో పాటు కాంగ్రెస్,టీఆర్ఎస్ నాయకులు బీజేపీని నిలదీస్తున్నారు. ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పసుపు బోర్డు సంగతి పక్కన ఉంచితే కనీస మద్దతు ధర, గిట్టుబాట ధర ఇస్తామని కూడా ప్రకటించలేని స్థితిలో ఉన్నారు అరవింద్. దీనికి తోడు కేంద్రం నుంచి పసుపు పరిశోధన కేంద్రం ఉసే లేకపోవడంపై ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
పసుపు ఎగుమతికి మంచిధర ఉన్న ఎందుకు గిట్టుబాటు ధర ఎందుకు కల్పించలేకపోతున్నారని అరవింద్‌పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పసుపు రైతులు వేస్తున్న ప్రశ్నలకు ఎంపీ అరవింద్,బీజేపీ దగ్గర ఎలాంటి సమాధానం లేదు. దీంతో రాబోయే రోజుల్లో నిజామాబాద్ ఎంపీ అరవింద్ క్షేత్రస్ధాయిలో పసుపు రైతులతో పాటు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొవడం ఖాయం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.