సాహో ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్‌..

820
sahoo audio release date
- Advertisement -

బాహుబలి తరువాత యంగ్‌ రెబెల్ స్టార్ ప్ర‌భాస్ నుంచి వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ సాహో. ఈ మూవీకి సంబంధించిన న్యూస్ ప్రతిరోజూ ఒక్కొక్కటి చొప్పున రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే ఇండియ‌న్ మూవీ ల‌వ‌ర్స్ కొసం సాహో రొమాంటిక్ పోస్టర్ ,స్టన్నింగ్ యాక్షన్ ప్యాక్ డ్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ స్టన్నింగ్ యాక్షన్ పోస్టర్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్స్ లో కొనసాగుతోంది.

తాజాగా సాహో ఆడియో రిలీజ్ ఫిక్స్ చేశారు చిత్ర నిర్మాతలు. తెలుగులో ఆగష్టు 17 వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున ఫ్యాన్స్ సమక్షంలో ఆడియో వేడుకను నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఆగస్ట్ 21 న కేరళలోని కోచిలో, ఆగష్టు 25 వ తేదీన బెంగళూరులో ,ఆగష్టు 27 వ తేదీన ముంబైలో భారీ ఈవెంట్స్ నిర్వహించనుంది యూవీ క్రియేషన్స్..ఆగస్టు 30న సినిమా విడుదల కానుంది.

అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీ తోఈ మూవీ తెరకెక్కింది. బాహుబలి లాంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రం త‌రువాత వ‌స్తున్న సినిమా కావ‌డంతో రెబ‌ల్‌స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఇండియ‌న్ సినిమా ల‌వ‌ర్స్ అంద‌రూ ఈ సినిమా పై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ మూవీ తెరకెక్కగా రన్ రాజా రన్ ఫేం సుజీత్ దర్శకత్వం వహించారు.

- Advertisement -