- Advertisement -
టర్కి, సిరియాలో భూకంపం ధాటికి రెండు దేశాలు అతలాకుతలం కాగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాలను తొలగించే కొద్ది మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 41 వేలకు చేరినట్లు తెలుస్తోంది.
భూకంపం సంభవించి తొమ్మిది రోజుల తర్వాత కూడా శిథిలాల కింద నుంచి ప్రజల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. నీరు, ఆహారం లేక కొందరు శిథిలాల కిందే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. వారిని ప్రాణాలతో సురక్షితంగా బయటకు తీసేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
మరోవైపు ఈ రెండు దేశాలను ఆదుకునేందుకు అనేక దేశాలు ముందుకొస్తున్నాయి. మేమున్నామంటూ భరోసానిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
- Advertisement -