తుంగభద్రకు పుష్కర శోభ..12 రోజుల పాటు పుష్కరాలు

185
pushkaralu
- Advertisement -

తుంగభద్రకు పుష్కర శోభ సంతరించుకుంది. నేటి నుండి 12 రోజుల పాటు తుంగభద్ర పుష్కరాలు జరగనుండగా ప్రత్యేక పూజలతో పుష్కరాలను ప్రారంభించనున్నారు సీఎం జగన్. ఇందుకోసం నది ప్రవహించే కర్నూలు జిల్లాలో 23 ఘాట్లు ఏర్పాట్లు చేయగా కోవిడ్‌ నేపథ్యంలో జాగ్రత్తలతో పుష్కరాలకు ఏర్పాట్లు చేశారు.

కరోనా నేపథ్యంలో ఘాట్లలో పుష్కరస్నానాలకు అనుమతి నిరాకరించగా ఈ–టికెట్‌ ద్వారానే పిండప్రదానాలకు అనుమతించనున్నారు. 12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక జాగ్రత్తలతో అన్ని ఏర్పాట్లు చేసింది. ఐదు వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. ఘాట్ల వద్ద ప్రత్యేకంగా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.

ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పుష్కరాలకు అనుమతి ఇచ్చింది. కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పుష్కరఘాట్ల వరకూ 43 బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఘాట్ల వద్ద తాత్కాలిక బస్‌షెల్టర్‌లను ఏర్పాటు చేశారు.

- Advertisement -