హ్యాపీ బర్త్ డే బంగారం:విఘ్నేశ్‌ శివన్

200
nayanthara
- Advertisement -

దక్షిణాది సూపర్ స్టార్ నయనతార బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నయన్‌కు విషెస్ తెలపగా తాజాగా దర్శకుడు విఘ్నేశ్‌ శివన్ తన ప్రేయసి నయన్‌కు బర్త్ డే విషెస్ తెలిపారు.

హ్యపీ బర్త్‌ డే బంగారం.. నువ్వు ఎల్లప్పుడూ అదే స్పూర్తినిస్తూ, అంకితభావంతో నిజాయితీ గా ఉండు. దేవుడు ఎల్లప్పుడూ నిన్ను సంతోషం, విజయాలతో ఆశీర్వదిస్తాడని తెలిపాడు. పాజిటివిటీ, అద్భుతమైన క్షణాలతో ఎంజాయ్‌ చేయాలి అని పేర్కొన్నాడు.

నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా తమిళ్ మూవీ ”నెట్రికన్”. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై విఘ్నేష్ శివన్ నిర్మించాడు. ‘గృహం’ చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్న మిలింద్ రౌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

- Advertisement -