వైవీ సంచలనం….వీఐపీ బ్రేక్ దర్శనంకు మంగళం..!

290
jagan yv subbareddy

ఓ వైపు పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న సీఎం జగన్‌ తన నిర్ణయాలతో రాజకీయవర్గాల్లో సంచలనంగా మారారు. తాజాగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సైతం జగన్ దారిలోనే నడుస్తున్నారు. టీటీడీలో సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం.

ఇందులో భాగంగా ఇప్పటివరకు ఉన్న ప్రొటోకాల్ దర్శనంతో పాటు ఎల్1, ఎల్2, ఎల్3లుగా ఉన్న వీఐపీ బ్రేక్‌ దర్శనాల విభజనను రద్దు చేయాలనే సంచలన నిర్ణయాన్ని త్వరలో అనౌన్స్‌ చేయనున్నారట వైవీ సుబ్బారెడ్డి . టీటీడీ పాలకమండలి కొలువుదీరిన తర్వాత తొలి సమావేశంలోనే తన నిర్ణయాన్ని వెలువరించనున్నారని వైసీపీ వర్గాల సమాచారం.

టీటీడీలో వీఐపీ దర్శనాలపై ఎప్పటినుంచో విమర్శలు వస్తున్నాయి. సామాన్య భక్తులకు ఇబ్బందిగా మారిన వీఐపీ దర్శనాలను రద్దుచేయాలని పలుమార్లు డిమాండ్ వచ్చినా పట్టించుకున్న సందర్భాలు తక్కువ. ఈ నేపథ్యంలో వైసీపీ సర్కార్‌ తీసుకోనున్న నిర్ణయం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారనుందనడంలో సందేహం లేదు.