3D ఎఫెక్ట్…అంబటి రాయుడికి నో ఛాన్స్

367
Ambati Raydu
- Advertisement -

 ప్రపంచ కప్ లో టీంఇండియా ప్లేయర్లు వరుసగా గాయాలపావుతున్నారు. కీలక మ్యాచ్ లలో ఆటగాళ్లు ఇలా గాయాలపాలవ్వడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇప్పటికే గాయం కారణంగా డ్యాషింగ్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ప్రపంచకప్‌ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత ఫేస్ బౌలర్ భువనేశ్వర్ కూడా బోటనవేలు గాయంతో వరల్డ్ కప్ కు దూరమయ్యాడు. శిఖర్ ధావన్ స్ధానంలో కేఎల్ రాహుల్ కు చోటు దక్కగా భువనేశ్వర్ స్ధానంలో రిషబ్ పంత్ కు చోటు దక్కింది. అయితే తాజాగా విజయ్ శంకర్ కూడా వరల్డ్ కప్ కు దూరం అయ్యాడు.

అయితే విజయ్ ప్లేస్ యువ ఆటగాడు మయాంక్ అగర్వాల్ కు చోటు కల్పించారు బీసీసీఐ అధికారులు. వరల్డ్ కప్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న అంబటి రాయుడుకి మరోసారి నిరాశే ఎదురైంది. సడన్ గా విజయ్ శంకర్ తెరపైకి రావడంతో ఆయన వైపు మొగ్గు చూపారు సెటక్టర్లు. విజయ్ బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు ఫిల్డిండ్ కూడా అద్భుతంగా చేస్తాడంటూ విజయ్ త్రీ డైమన్షన్‌ ఆటగాడు అతన్ని పొడిగారు సెలక్టర్లు.

దీంతో సెలక్టర్లపై విరుచుకుపడ్డాడు రాయుడు. విజయ్ శంకర్ ఆటకోసం త్రిడి కళ్లద్దాలు ఆర్డర్ చేశానంటూ సెటైర్ వేశాడు రాయుడు. అదే కోపంతో సెలక్టర్లు అతని వైపు మొగ్గుచూపడం లేదని ఉహాగానాలు వస్తున్నాయి. మరోవైపు అంబటి రాయుడుకి చోటు కల్పించకపోవడంతో క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా బీసీసీఐ అధికారులపై ఫైర్ అవుతున్నారు.

- Advertisement -