గ్రేటర్‌ పరిధిలో ఆధునిక సిగ్నల్ వ్యవస్థ..

399
traffic signals
- Advertisement -

హైదరాబాద్ మహానగరం దేశంలో మరో నూతన ఆవిష్కరణకు వేదికైంది. ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థలో ఎల్ఈడీ స్టాప్ లైన్ సిగ్నలింగ్ ను ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. వాహనదారులు, పాదచారులు ఊయోగపడేలా సరికొత్త ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఉపయోగపడనుంది.

అనలాగ్​, డిజిటల్​ ల్యాబ్​ సహకారంతో ఈ సరికొత్త సిగ్నలింగ్ వ్యవస్థను బంజారాహిల్స్ ​లోని కేబీఆర్​ పార్కు కూడలి వద్ద ప్రయోగాత్మకంగా ఉంచారు. వీటి పనితీరు ఆధారంగా మిగతా ప్రాంతాలకు విస్తరించనున్నారు.

ఈ-స్టాప్ లైన్ సిగ్నల్ ప్రధాన సిగ్నల్‌లతో ఆక్టివేషన్ అవుతుంది. దీంతో పోల్ మీద ఏ సిగ్నల్ పడుతోందో ఇక్కడా అదే సిగ్నల్ లైటింగ్ వస్తుంది.

హైదరాబాద్ మహానగరంలోని ప్రధాన రహదారులన్నీ నిత్యం వాహనాల రాకపోకలతో ఎంతో బిజీగా ఉంటాయి. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రోడ్డు క్రాస్ చేసే వాహనదారులు స్టాప్ లైన్ దాటి వాహనాలను నిలుపుతున్నారు. దీంతో పాదాచారులకు రోడ్డు దాటడం నరకంగా మారింది. వారి సమస్యలను తీర్చేందుకు ఈసరికొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టారం పోలీసులు.

- Advertisement -