సన్నీ కౌశల్‌తో కత్రినా చెల్లెలు డేటింగ్?

4
- Advertisement -

కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌ల వివాహ బంధం వల్ల వారి తోబుట్టువులు ఇసాబెల్ (ఇసా) కైఫ్, సన్నీ కౌశల్ మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. తరచుగా ముంబైలోని కత్రినా-విక్కీ ఇంట్లో వీరిద్దరూ కలిసి సమయం గడుపుతూ కనిపిస్తుంటారు. అయితే, వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం ఇప్పుడు ప్రేమగా మారిందా? అనే అనుమానాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.

ఇసాబెల్, సన్నీలు తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకే ప్రాంతానికి సంబంధించిన ఫోటోలను వేర్వేరు యాంగిల్స్ నుండి షేర్ చేశారు. వీరు టర్కీలోని ఇస్తాంబుల్‌లో కలిసి సెలవులను గడిపినట్లు ఆ పోస్ట్ పేర్కొంది. సన్నీ ఈ ఫోటోలను శుక్రవారం పోస్ట్ చేయగా, ఇసాబెల్ తన ఫోటోలను జులై నెలలోనే పోస్ట్ చేసింది. దీంతో అభిమానుల్లో గందరగోళం మొదలైంది.

ఒక నెటిజన్ సరదాగా “దీదీ తేరా దేవర్ దీవానా… ” అని కామెంట్ చేయగా, మరొకరు “ఇది నిజమైతే నిజంగానే క్రేజీగా ఉంటుంది” అని రాశారు. వీరిద్దరూ కలిసి ఏమైనా సినిమా లేదా ప్రాజెక్ట్ చేస్తున్నారా? ఇంత స్పష్టంగా ఉండే పిక్స్ పోస్ట్ చేసి ప్రేమను ఎందుకు బయటపెడతారు? ఏదో తేడాగా ఉంది” అని ఒకరు కామెంట్ చేయగా.. వారు కుటుంబ సభ్యులు, ఒకరికొకరు బంధువులు కాబట్టి కలిసి వెకేషన్‌కు వెళ్లడంలో లేదా ఒకే పుస్తకం చదవడంలో తప్పేముంది? అని మరికొందరు సన్నీ-ఇసాలకు మద్దతుగా నిలిచారు.

Also Read:మిర్జాపూర్ సక్సెస్‌పై సోనాల్

ఈ వార్తలపై ఇటు ఇసాబెల్ కానీ అటు సన్నీ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. గతంలో సన్నీ కౌశల్ నటి షార్వరి వాగ్‌తో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. విక్కీ-కత్రినాల వివాహానికి కూడా ఆమె హాజరైంది. అయితే, తమ కెరీర్ వేగానికి సంబంధించిన విభేదాల కారణంగా 2025లోనే సన్నీ, షార్వరి విడిపోయారని వార్తలు వచ్చాయి.

- Advertisement -