కిక్కిరిసిన తిరుమల..

88
ttd
- Advertisement -

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. బాలాజీ దర్శనం కోసం భక్తులు రెండు రోజులగా వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతుండగా నిన్న స్వామివారిని 72,216 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండి ఆదాయం రూ. 5.65 కోట్లుకాగా 32,338 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

లైన్లలో యాత్రికులకు సరైన ఆహారం, నీరు లేవు. పిల్లలు లైన్‌లో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉచిత దర్శనం కోసం సగటున పది కిలోమీటర్లు నడవాలి. టీటీడీ అన్ని దర్శనాలకు టోకెన్ విధానాన్ని ప్రారంభించడం మంచిదని భక్తులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -