శ్రీవారి దర్శనానికి బ్రేక్

329
lord balaji
- Advertisement -

కళియుగ వైకుంఠం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనానికి ఇవాళ కొన్ని గంటల పాటు బ్రేక్ పడనుంది. వరాహస్వామి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ క్రతువును 37 ఏళ్ల అనంతరం నిర్వహిస్తుండగా ఈ క్రతువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకు 5 గంటల పాటు దర్శనానికి బ్రేక్ పడనుంది.

కర్కాటక లగ్నంలో ఉదయం 11.07 నుంచి మధ్యాహ్నం 1.16 గంటల వరకు మహాసంప్రోక్షణ క్రతువు జరగనుంది. అనంతరం ఘంటానాదం, నిత్యకట్ల కైంకర్యాల్లో భాగంగా తోమాల, అర్చన, నైవేద్యం,  తదితర పూజాదికాలు నిర్వహిస్తారు. ఇదే సమయంలో శ్రీవారి ఆలయంలోనూ ఘంటానాదం, నిత్యకట్ల కైంకర్యాలు ఉంటాయి.

దీంతో 5 గంటల పాటు వీఐపీ దర్శనాన్ని పూర్తిగా టీటీడీ రద్దు చేసింది. వీటితోపాటు కల్యాణోత్సవం, ఊంజలసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం సేవలను రద్దు చేశారు.

- Advertisement -