మేలో రైతుబంధు..ఎకరాకు 10వేలు

452
rythu bandhu
- Advertisement -

ఖరీఫ్‌ సీజన్‌లో రైతుబంధు పెట్టుబడి సాయాన్ని మే చివరి వారంలో అందించేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. గతంలో ఎకరాకు 4 వేలు అందిస్తుండగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది నుండి ఎకరాకు 5 వేల చొప్పున రెండు పంటలకు పదివేల సాయం అందించనుంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రైతుల ఖాతాల్లో 5వేల రూపాయలు జమ కానుంది.

జూన్ నుండి ఖరీఫ్ ప్రారంభమవుతుండటంతో ముందస్తుగానే మే చివరివారంలో రైతులకు పెట్టుబడి అందించడం ద్వారా వారికి ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రైతుబంధు అమలు కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే.

రాష్ట్రం మొత్తం 53.68 లక్షల మంది రైతులకు 1.42 కోట్ల ఎకరాల భూమి ఉం ది. ఇందులో అత్యధికంగా 48.19 లక్షల మంది రైతులు చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. గతేడాది ఖరీఫ్‌లో రైతుబంధు కింద ఎకరాకు రూ. 4 వేల చొ ప్పున 50.88 లక్షల మంది రైతులకు రూ.5257 కోట్లు చెక్కుల రూపంలో పంపిణీ చేశారు. ఇదే అంచనా ప్రకారం ఒక కోటి 30 లక్షల యాభై వేల ఎకరాలకు రూ.5 వేల చొప్పున రూ.6575 కోట్లు ఖరీఫ్ సీజన్‌కు అవసరమవుతాయని అధికారులు భాస్తున్నారు.

అయితే ఈసారి మార్గదర్శకాలు కొంతమేరకు సవరిస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీనిలో వాస్తవం లేదని అధికారులు చెబుతున్నారు. గతేడాది ఇచ్చిన మార్గర్శకాల ప్రకారమే రైతు బంధు అందించనున్నారు. రైతుల వివరాలన్ని ప్రభుత్వం దగ్గర ఉండటంతో నేరుగా వారి ఖాతాల్లోనే రైతు బంధు సొమ్మును జమ చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది.

- Advertisement -