టీఆర్ఎస్‌ జెండా ఆవిష్కరించిన కేటీఆర్…

316
ktr telangana bhavan

తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,వివిధ కార్పొరేషన్‌ల ఛైర్మన్లు పాల్గొన్నారు.

అంతకముందుకు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్. 2001 ఏప్రిల్ 27న ఒక వ్యక్తి ప్రారంభించిన సాహసోపేత ప్రస్ధానం ఇప్పుడు చరత్రగా మారిందని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగ జరుగుతున్నాయి. ఊరూ,వాడవాడలా గులాబీ జెండాను ఎగరేసి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు పార్టీ కార్యకర్తలు,నాయకులు.