రేపు శ్రీవారి ఆలయం మూసివేత..

194
ttd
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయాన్ని రేపు మూసివేయనున్నారు. నవంబర్ 8 చంద్రగ్రహణం కావడంతో ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. 11 గంటల పాటు అంటే ఉదయం 8.40 గంటల నుంచి రాత్రి 7.20 గంటల వరకు ఆలయ తలుపులు మూసి ఉంచనున్నారు.

చంద్ర గ్రహణం నేపథ్యంలో నవంబర్ 7న సిఫారసు లేఖలు స్వీకరించడం లేదని టీటీడీ తెలిపింది. గ్రహణం రోజున సర్వదర్శనం టోకెన్ల జారీ, బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసింది.

గ్రహణం ముగిసిన అనంతరం సంప్రోక్షణ, ప్రదోష కాలపు పూజలు నిర్వహించి ఆలయాన్ని తిరిగి తెరుస్తారు.

- Advertisement -