కలియుగ ప్రత్యక్ష దైవం అయిన తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ తెలిపింది. ఇక నుంచి శ్రీవేంకటేశ్వర స్వామి వారి సేవల కోసం వినియోగించే గోవింద యాప్ స్థానంలో టీటీదేవస్థానమ్స్ యాప్ పేరుతో అందుబాటులోకి తీసుకువచ్చామని టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఆలయ ఈవో ధర్మారెడ్డిలు తెలిపారు. ఈ యాప్ ను జియో సహకారంతో రుపొందించినట్టు టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు.
జియో సంస్థ రూ.20కోట్ల వ్యయంతో ఈ యాప్ ను రూపొందిచినట్టు సుబ్బారెడ్డి అన్నారు. అయితే ఈ మొత్తాన్ని జియో సంస్థ భరించి ఉచితంగా యాప్‌ను అందించిందని ఛైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు. ఇందులో టీటీడీ సేవలు, దర్శనం, గదులు, ఆర్జిత సేవా టికెట్లను భక్తులు నేరుగా బుకింగ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ఎస్‌వీబీసీ భక్తి చానల్‌లో వచ్చే కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. యాప్‌లో తిరుమల చరిత్ర, స్వామివారి కైంకర్యాల వివరాలను పొందుపరిచినట్లు వివరించారు.
తిరుమల శ్రీవారికి విరాళాలు కూడా అందజేయవచ్చని చైర్మెన్ సుబ్బారెడ్డి చెప్పారు. గతంలో గోవింద యాప్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కొత్తగా టీటీదేవస్థానమ్స్ యాప్‌ను రూపొందించినట్టు తెలిపారు. ఇప్పటికే గోవింద యాప్ కలిగిన వారు దీన్ని అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి…