- Advertisement -
టీటీడీ సెక్యూరిటీ సిబ్బందిలో మరోసారి డొల్లతనం బయటపడింది. తిరుమలలో పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి వెళ్లేందుకు భక్తులు ప్రయత్నించారు. భక్తులు చెప్పులతో వెళ్తుండడాన్ని ఆలయ మహాద్వారం వద్ద గుర్తించి భద్రతా సిబ్బంది.. వారిని అక్కడే అడ్డుకున్నారు.
దీంతో పాదరక్షలను మహాద్వారం వద్ద వదిలేసి ఆలయంలోకి వెళ్లిన భక్తులు. వైకుంఠంలోకి భక్తులు ప్రవేశించే సమయంలోనే విజిలెన్స్, TTDఉద్యోగులు గుర్తించాల్సి ఉంటుంది. ఉద్యోగులు పట్టించుకోక పోవడంతో చెప్పులతోనే ఆలయ మహాద్వారం వరకు భక్తులు వచ్చేశారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వరకు 3 చోట్ల తనిఖీలు జరుగగా ఒక్క దగ్గర కూడా భక్తులకు చెప్పులున్న విషయాన్ని గుర్తించలేదు సిబ్బంది. దీంతో ఈ ఘటనపై టీటీడీ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.
Also Read:విజయశాంతి దంపతులకు బెదరింపులు
- Advertisement -