- Advertisement -
పవిత్ర కార్తీకమాసంలో నిర్వహించే కార్తీక వన భోజన మహోత్సవంలో భాగంగా ఆదివారం తిరుమల వైభవోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది.
ఇందులో భాగంగా ఉదయం శ్రీ మలయప్పస్వామివారు, ఉభయనాంచారులను ఊరేగింపుగా వైభవోత్సవ మండపానికి తీసుకొచ్చారు.అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు.
సాధారణంగా కార్తీక మాసంలో పార్వేట మండపంలో టీటీడీ వనభోజనం నిర్వహిస్తుంది. అయితే భారీ వర్ష హెచ్చరికల నేపథ్యంలో ఈ ఏడాది వేదికను తిరుమల ఆలయం ఎదురుగా ఉన్న వైభవోత్సవ మండపానికి మార్చారు.స్నపనం అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.
ALso Read:Pawan:తెలంగాణ నా గుండె చప్పుడు
- Advertisement -