తిరుమల అనగానే గుర్తుచ్చేది లడ్డూ. ఇక్కడ రోజువారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య దాదాపుగా లక్షపై మాటే. కానీ ఇంతమంది భక్తులు వస్తుంటే ప్రభుత్వం మరియు టీటీడీ ఏలా వారి బాగోగులు చూసుకుంటుంది. కానీ టీటీడీ సంస్థ మాత్రం భక్తుల కోసం స్వామి భక్తులను సేవలకు వినియోగిస్తోంది. శ్రీవారి సేవ అనే పేరుతో 2000వ సంవత్సరంలో ఈ సేవను ప్రారంభించారు. ఈ సేవ ద్వారా తిరుమలకు వచ్చే భక్తులకు ఉచితంగా సేవ చేసే అవకాశం టీటీడీ కల్పించింది. ఇందులో మొత్తం 12రకాల సేవల్లో భక్తులు పాలు పంచుకుని స్వామి సేవల్లో తరించే విధంగా ఏర్పాట్లు చేశారు.
శ్రీవారి సేవ కోసం దేశం నలూమూలల నుంచి కాకుండా విదేశాల నుండి భక్తులు శ్రీవారి సేవకు రావడం మొదలైంది. లండన్‌లో స్థిరపడిన భక్తురాలు నీతు కేరళలోని తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి శ్రీవారి సేవకు వచ్చారు. శ్రీవారి సేవల్లో తరించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు నీతు అన్నారు. తమకు ఎంతో సంతోషంగా ఉన్నదని నీతు కుటుంబీకులు అన్నారు.
మొత్తం 11 మంది గల కుటుంబ సభ్యులు ఆన్ లైన్లో బుక్ చేసుకుని శ్రీవారి సేవలో తరించారు. నీతు లండన్‌లో ఒక ప్రముఖ సంస్థలో అధికారిణిగా పనిచేస్తున్నారు. ఈ బృందం సభ్యులు నాలుగు రోజులపాటు అన్నప్రసాద కేంద్రంలో కూరగాయలు తరగడం, అన్నప్రసాదాలు వడ్డించడం, కళ్యాణకట్టలో క్యూలైన్ల క్రమబద్ధీకరణ, భక్తులకు బ్లేడ్లు అందించడం, అగరబత్తీల విక్రయం తదితర సేవలు అందించారు.
ఈ సందర్భంగా ఈ కేంద్రం పరిశీలనకు విచ్చేసిన టీటీడీ జేఈఓ శ్రీమతి సదా భార్గవి నీతుతోపాటు ఆమె కుటుంబసభ్యులతో ముచ్చటించారు. శ్రీవారి సేవ చేసేందుకు లండన్ నుంచి వచ్చినందుకు అభినందించారు. యువతీ యువకులకు స్ఫూర్తిగా నిలువడం హర్షణీయమని చెప్పారు. యువతీ యువకులు శ్రీవారి సేవలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా జేఈఓ కోరారు.
ఇవి కూడా చదవండి..