టీటీడీ వెబ్‌సైట్ వాడండి.. నకిలీ నమ్నకండి- టీటీడీ ఈఓ

40
- Advertisement -

తిరుమల అన్నమయ్య భవనంలో అధికారులతో టీటీడీ ఈఓ జవహర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమలలో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏర్పాటు కమిటీ నియమించాని.. ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే ప్రాంతాలు నిపుణులచే గుర్తించి వాటికి మరమ్మత్తులు చేపడుతామన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుమలలో ప్లాస్టిక్ బ్యాన్‌పై కమిటీని నియమించాము. లడ్డు కవర్లు బయోడిగ్రేడబుల్ అయినవి ఏర్పాటు చేశామని.. త్వరలోనే తిరుమలలో అన్ని దుకాణాలలో బయోడిగ్రేడబుల్ సంచులు వాడేలా చర్యలు తీసుకుంటామన్నారు.

హనుమాన్ జన్మస్థలం అభివృద్ది చేస్తాము. ఈమేరకు హనుమాన్ జన్మస్థలంలో ఫిబ్రవరి 16 , ఉదయం 9:30 భూమి పూజ నిర్వహిస్తాము. తరిగొండ వెంగమాంబ బృందావనం పనులు ఫిబ్రవరి16 ప్రారంభిస్తాము. అన్ని అనుకూలిస్తే ఫిబ్రవరి 15 తర్వాత ఆఫ్ లైన్ సర్వదర్శనం టికెట్లు జారీ చేస్తామని ఈఓ తెలిపారు. అంతేకాదు స్వామివారి ఆర్జితసేవలపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకొంటామన్నారు. శ్రీవారి దర్శన టికెట్ల కొరకు టీటీడీ వెబ్‌సైట్ వాడండి, నకిలీ వెబ్‌సైట్ నమ్నకండి అని ఈఓ జవహర్ రెడ్డి కోరారు.

- Advertisement -