TTD:కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ

9
- Advertisement -

తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో సోమ‌వారం టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం జ‌రిగింది. స్విమ్స్‌ ఆసుపత్రిలో రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు 479 నర్సు పోస్టులు క్రియేట్‌ చేసేందుకు ఆమోదం తెలిపారు.

టీటీడీలో గ‌తంలో చాలామంది నోటిఫికేష‌న్‌, రూల్ ఆఫ్ రిజ‌ర్వేష‌న్‌(ఆర్‌వోఆర్) ద్వారా కాకుండా బోర్డు ఆమోదంతో ప‌రిపాల‌నా సౌల‌భ్యం కొర‌కు కాంట్రాక్టు/పొరుగుసేవ‌ల ఉద్యోగుల‌ను తీసుకోవ‌డం జ‌రిగింది. జి.ఓ.నం.114 ప్ర‌కారం కొన్ని నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించి వారి సేవ‌లు క్ర‌మ‌బ‌ద్ధీక‌రించేందుకు ప్ర‌భుత్వానికి నివేదిక పంపాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

టీటీడీ కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థినీ విద్యార్థులందరికీ ఎలాంటి సిఫారసు లేకుండా హాస్టల్‌ వసతి కల్పించడం కోసం అవసరమైన హాస్ట‌ళ్ల నిర్మాణానికి ఆమోదం తెలపగా..రూ.1.88 కోట్లతో తిరుమలలో భక్తుల సౌకర్యార్థం పిఏసి-1 లో 10 లిఫ్టులు ఏర్పాటుకు టెండరు ఆమోదం తెలిపారు. రూ.1.50 కోట్లతో బాలాజి నగర్‌ తూర్పువైపున, అదేవిధంగా, శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం ఔటర్‌ కార్డన్‌ ప్రాంతంలో మిగిలిపోయిన ఫెన్సింగ్‌ ఏర్పాటుకు ఆమోదం చెప్పారు.

రూ.14 కోట్లతో తిరుమలలో టీటీడీ ఉద్యోగుల పాత సి టైప్‌, డి టైప్‌, కొత్త సి టైప్‌, డి టైప్‌ క్వార్టర్లలో మిగిలి ఉన్న 184 క్వార్టర్ల అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆమోదం చెప్పగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని భాష్యకార్ల సన్నిధిలోని మకర తోరణానికి, శ్రీ పార్థసారథిస్వామి, శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి తిరువాభరణాలకు బంగారు పూత పూసేందుకు ఆమోదం చెప్పారు.

టీటీడీ ఐటీ సేవల కోసం టైర్‌ 3 డేటా సెంటర్‌, డిజాస్టర్‌ రికవరీ సెంటర్‌ ఉన్నాయి. ఐటి స్టాండర్డ్‌ ప్రోటోకాల్‌ ప్రకారం లైఫ్‌సైకిల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రక్రియలో భాగంగా ప్రతి ఏడు సంవత్సరాలకోసారి టెక్‌ రీప్లేస్‌మెంట్‌ చేయాలి. ఇందులోభాగంగా ఐదేళ్ల పాటు డేటా సెంటర్ల మెయింటెనెన్స్‌ కోసం రూ.12 కోట్లు మంజూరుకు ఆమోదం చెప్పగా టీటీడీ ఆధ్వర్యంలో 15 చారిత్రాత్మక, పురాతన ఆలయాలు, 13 టీటీడీ నిర్మించిన ఆలయాలు, 22 ఆధీనంలోకి తీసుకున్న ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల్లో అవసరమైన అభివృద్ధి పనులను శ్రీవాణి ట్రస్టు నిధుల ద్వారా చేపట్టేందుకు పాల‌న అనుమ‌తికి ఆమోదం చెప్పారు.

ఇటీవల ఘాట్‌ రోడ్డులో ప్రమాదవశాత్తు మరణించిన తిరుమల శ్రీవారి ఆలయ పరిచారిక శ్రీయతిరాజన్‌ నరసింహన్‌ కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Also Read:స్టోన్ ఫ్రూట్స్ తో క్యాన్సర్ కు చెక్!

- Advertisement -