దేవదేవుడైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్యాశీస్సులతో దేశంలోనూ, రాష్ట్రంలోనూ సమృద్ధిగా వర్షాలు కురవాలని, ప్రజలందరికీ మంచి జరగాలనే సత్సంకల్పంతో శ్రీనివాస అష్టోత్తర శతకుండాత్మక మహాశాంతి వరుణయాగం తలపెట్టామని టీటీడీ ఛైర్మనక్ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద మహాశాంతి వరుణయాగంలో భాగంగా శుక్రవారం ఉదయం ఆచార్య రుత్విక్ వరణం జరిగింది.
ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ….ఇవాళ్టి నుండి ఈ నెల 11వ తేదీ వరకు ఇక్కడ యాగం నిర్వహిస్తామని చెప్పారు. నెల క్రితం తిరుమల ధర్మగిరిలో నిర్వహించిన వరుణయాగం వల్ల వర్షాలు బాగా కురిశాయన్నారు. ఈ సంవత్సరంతో పాటు, వచ్చే సంవత్సరం కూడా తక్కువ వర్షపాతం నమోదవుతుందన్న వాతావరణ నిపుణుల సూచనల నేపథ్యంలో ప్రజల క్షేమం కోసం, వారికి సౌభాగ్యం కలగాలని కోరుకుంటూ టీటీడీ ఈ యాగాన్ని నిర్వహిస్తోందని వివరించారు. ఈ యాగం వల్ల పరిపూర్ణంగా వర్షాలు కురుస్తాయన్న నమ్మకం ఉందన్నారు.
Also Read:ఆపరేషన్ చంద్రబాబు..జగన్ సక్సస్ అయ్యరా?