Bhumana:హిందూ ధర్మంలోకి ఇతర మతస్తులకు స్వాగతం

21
- Advertisement -

మానవులు ధర్మబద్ధంగా జీవించాలని తెలిపే హిందూ సనాతన ధర్మం ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన మత విశ్వాసమని, ఈ ధర్మాన్ని ఆచరించేందుకు తమకు తాముగా, స్వచ్ఛందంగా ముందుకు వచ్చే ఇతర మతాలకు చెందిన వారిని స్వాగతిస్తున్నామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు.

ఆదివారం ఉదయం జరిగిన ధార్మిక సదస్సులో ఛైర్మన్ మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేయడంలో భాగంగా హిందూ ధర్మం పట్ల అపారమైన గౌరవం, విశ్వాసం గల ఇతర మతాల వారిని ఆహ్వానించేందుకు తిరుమలలో తగిన ఏర్పాట్లు చేయాలని టీటీడీ యోచిస్తున్నట్లు చెప్పారు. ఇతర మతాల భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వస్తే శ్రీ వేంకటేశ్వరస్వామివారి పాదకమలాల వద్ద హిందూ ఆచారాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపై శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ధార్మిక సదస్సులో పాల్గొన్న పీఠాధిపతులందరూ ఈ విషయాలను అభినందించారు.

Also Read:ఇకపై TS కాదు TG..కేబినెట్ నిర్ణయాలివే

- Advertisement -