మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ని కలిసిన టూర్ ఏజెంట్స్‌,ఆపరేటర్‌లు

32
srinivas goud

రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారిని టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో కోవిడ్ మహమ్మారి వల్ల పర్యాటక రంగం పూర్తిగా నష్టపోయిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టూర్స్ ఏజెంట్స్, ఆపరేటర్ లను ఆదుకోవడానికి ప్యాకెజి ని అమలు చేయాలని అసోసియేషన్ ఛైర్మన్ శ్రీ R V రమణ ఆధ్వర్యంలో వచ్చిన ప్రతినిధులు బృందం వినతిపత్రాన్ని హైదరాబాద్ లోని తన నివాసంలో అందజేశారు.

ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక రంగం ఎంతో ముఖ్యమైన రంగమన్నారు. పర్యాటక రంగం ద్వారా ఎంతో మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న ఏకకై రంగమని, ఈ రంగంలో అనేకమంది ఏజెంట్స్, ఆపరేటర్లు నేడు ఆర్థికంగా నష్టపోయారని మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారికి అసోసియేషన్ బృందం వివరించారు. ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలలో పర్యాటక రంగం అభివృద్ధి కి, టూర్స్, ట్రావెల్స్ ఆపరేటర్ ల కోసం ప్రభుత్వం తరపున ఉద్దీపన ప్యాకెజి లను , బ్యాంక్ ల ద్వారా టూర్ ఆపరేటర్ లకు ప్రత్యేక లోన్ సౌకర్యం ను కల్పించేందుకు అనేక ప్రోత్సాహకాలను అమలు చేస్తున్నారని మంత్రి కి వివరించారు అసోసియేషన్ చైర్మన్ RV రమణ మరియు అసోసియేషన్ నాయకులు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి కి సీఎం కేసీఆర్ గారు కృషి చేస్తున్నారన్నారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల పర్యాటక రంగం పూర్తిగా కుదేలయిందన్నారు. పర్యాటక రంగాల్లో విశేష సేవలను అందిస్తున్న ఏజెంట్స్, టూర్ ఆపరేటర్ లు నేడు ఆర్థికంగా ఎంతో నష్టపోయరన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు. పర్యాటక రంగం మళ్ళీ అభివృద్ధి పథంలో కి వచ్చేందుకు తన వంతుగా కృషి చేస్తున్నామన్నారు. టూర్ ఏజెంట్స్, ఆపరేటర్ ల అసోసియేషన్ ఇచ్చిన వినతి పత్రం లోని అంశాలను ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ బృందం మంత్రి గారికి ఇచ్చిన వినతిపత్రం లో పలు అంశాలపై చర్చించారు. సానుకూలంగా స్పందించారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు.ఈ కార్యక్రమంలో గద్వాల శాసన సభ్యులు శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అసోసియేషన్ ప్రెసిడెంట్ K. శ్రీనివాస్ రావు, కార్యదర్శి K. రామణ కుమార్, తదితరులు పాల్గొన్నారు.