బాల్క సుమన్‌ని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత…

42
kavitha

ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ని పరామర్శించారు ఎమ్మెల్సీ కవిత. బాల్క సుమన్ తండ్రి,టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మెట్ పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ బాల్క సురేష్ (60) అనారోగ్యంతో మృతిచెందిన సంగతి తెలిసిందే.

మంగళవారం ఎమ్మెల్యే బాల్క సుమన్ స్వగ్రామం రేగుంట (మెట్ పల్లి) లో స్వర్గీయ సురేష్ చిత్ర పటానికి నివాళులు అర్పించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లా రెడ్డి, ఎమ్మెల్సీలు కవిత , శంబిపూర్ రాజు , ఎమ్మెల్యే వివేక్, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ , జీహెచ్ఎంసీ కార్పోరేటర్ బాబా ఫసియుద్దిన్ తదితరులు ఉన్నారు.