మొక్కలు నాటిన టూరిజం కార్పొరేషన్ ఈడీ శంకర్ రెడ్డి..

178
TSTDC ED Shankar Reddy
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి గురువారం తారామతి బారామతి హోటల్‌లో టూరిజం కార్పొరేషన్ ఈడీ శంకర్ రెడ్డి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలు నాటడం చాలా ముఖ్యమని భవిష్యత్ తరాల కోసం మనమందరం బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. అందరు కూడా ఏదో ఒక్క రకంగా మొక్కలు పెంచడం కోసం బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -