ఢిల్లీలో పసుపు రైతులు..సీఈసీతో భేటీ

325
varanasi

దేశవ్యాప్తంగా పసుపుకు మద్దతు ధరతో పాటు ప్రత్యేక బోర్డు ఏర్పాటుచేయాలని కొంతకాలంగా ఆందోళన చేస్తున్న పసుపు రైతులు వారణాసి బాటపట్టిన సంగతి తెలిసిందే. అయితే మోడీపై పోటీకి దిగిన ఆర్మూర్ పసుపు రైతులకు చుక్కెదురయింది. నామినేషన్ల పరిశీలనలో రైతుల నామినేషన్లు తిరస్కరణకు గురికాగా ఒకే ఒక రైతు నామినేషన్ మాత్రమే అమోదం పొందింది.

ఈ నేపథ్యంలో నామినేషన్ల తిరస్కరణపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని రైతులు నిర్ణయించారు. దీనిలో భాగంగా ఢిల్లీలోని నిర్వచన్ సదన్ చేరుకున్నారు తెలంగాణ, తమిళనాడు రైతులు.

వారణాసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏకపక్షంగా తమ నామినేషన్లను తిరస్కరించారని ఫిర్యాదు చేయనున్నారు.మొత్తం వారణాసిలో 119 నామినేషన్లు దాఖలుగా కాగా.. ఏకంగా 89 నామినేషన్లను అధికారులు వివిధ కారణాలతో తిరస్కరించారు. ప్రస్తుతం మోడీ సహా 30మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.